12-12-2025 12:00:00 AM
ఏఐసీసీ కార్యాలయాన్ని ముట్టడించిన బీసీ నేతలు..
ముషీరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): తెలంగాణలో బ్యాక్వర్డ్ క్లాసెస్ (బీసీ)లకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీసీ నేతలు న్యూఢిల్లీలోని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కార్యాలయాన్ని ముట్టడించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ర్యాగా రుషి అరుణ్ కు మార్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షు డు బీసీ జేఏసీ కో-ఆర్డినేటర్ గుజ్జ సత్యం ఆధ్వర్యం లో జరిగిన ఈ ప్రదర్శనలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
అక్బర్ ర్పో ఉన్న ఏఐసీసీ కార్యాలయం వద్ద గురువారం పెద్ద సంఖ్యలో బీసీ నేతలు కార్యకర్తలు సమావేశమై నినాదాలు చేశారు. ప్రదర్శనకారులు కార్యాలయం లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగిందన్నారు. డాక్టర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని రెండేళ్లుగా డ్రామా నడిపారన్నారు. ఇప్పుడు హామీలను పక్కన పెట్టి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇది మోసం, నయవంచన అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పదవిని బీసీ నేతకు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ తన నిజాయితీని రుజువు చేసుకోవాలని సూచించారు. జనవరిలో 10 జనపథ్ వద్ద పెద్ద ఎత్తున ముట్టడి చేస్తామని హెచ్చరించారు.
జాతీ య బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం మాట్లాడుతూ భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ తెలంగాణలో చేసిన ప్రకట నలను గుర్తు చేశారు. తెలంగాణలో కుల గణన స్థానిక సంస్థల రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా రోల్ మోడల్‌గా ఉంటాయని రాహుల్ గాంధీ చెప్పారన్నారు. కానీ కుల సర్వే లెక్కలు ఉన్నప్పటికీ బీసీ రిజర్వేషన్లు తగ్గాయన్నారు.
ఈ ముట్టడిలో నీల వెంకటేష్ ముదిరాజ్, జక్కని సంజయ్ కుమార్, అనంతయ్య, ఆది మల్లేశం, మనోజ్ గౌడ్, శ్రీమన్, జక్కన్ సంజయ్, శ్రీనివాస్, శివకుమార్ యాదవ్, వేణు యాదవ్, కిషోర్, లక్ష్మీప్రసన్న, ప్రియాంక, స్వరూప, అనురాధ గౌడ్, పద్మా పాల్గొన్నారు.