6 March, 2026 | 3:11 AM

యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

06-03-2026 12:00 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, మార్చి ౫ (విజయక్రాంతి): యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య  జిల్లా కార్యదర్శి గోడిసెల కార్తీక్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని డీవైఎఫ్‌ఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్లో పేర్కొన్న హామీలను అమలు చేయాలని కోరారు.

జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు గెడం టికానంద్, జిల్లా సహాయ కార్యదర్శి దుర్గం రాజ్కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం నిఖిల్, ఆత్మకూరి సతీష్, జిల్లా కమిటీ సభ్యురాలు కుందరాం మంజుల తదితరులు పాల్గొన్నారు.