calender_icon.png 5 February, 2026 | 5:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రిన్సిపాల్స్ ప్రమోషన్లు రద్దు చేయాలి

29-07-2024 12:34:32 AM

డీబీఎఫ్, పీడీఎస్‌యూ నాయకుల డిమాండ్

సిద్దిపేట, జూలై 28 (విజయక్రాంతి) : తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల మహిళ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్స్ ప్రమోషన్లలో దళిత, బహుజన ఉద్యోగులకు అన్యాయం జరిగిందని, వెంటనే ప్రమోషన్లు రద్దు చేయాలని డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పీ శంకర్, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌వీ శ్రీకాంత్‌లు డిమాండ్ చేశారు. ఆదివారం సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడుతూ.. 2020లో ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ పోస్టులను ఖాళీగా చూపించారని, వాటిని ఇప్పుడు ప్రమోషన్లతో భర్తీ చేయడం సరికాదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల ఖాళీలను బ్యాక్‌లాగ్ పోస్టుల కింద భర్తీ చేసిన తర్వాతే ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉన్నత విద్యా మండలి వెంటానే స్పందించి ప్రమోషన్లను రద్దు చేయాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.