calender_icon.png 5 February, 2026 | 12:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఊపందుకున్న సాగు

29-07-2024 12:30:46 AM

భూపాలపల్లి, విజయక్రాంతి: వారం రోజుల నుంచి వర్షాలు పుష్కలంగా కురుస్తున్నాయి. దీంతో గ్రామాల్లో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. పొద్దు పొడవంగానే పల్లె జనం ఎవుసం పనుల్లో కనిపిస్తున్నారు. పనులు ఊపందుకోవడంతో పొలాలన్నీ రైతులు, కూలీలతో కళకళలాడుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. వరి నాట్లు ఊపందుకోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.