calender_icon.png 3 May, 2025 | 11:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్ద చెరువు కట్ట శిఖం భూమిని కబ్జాదారుల నుండి కాపాడండి

02-05-2025 10:53:17 PM

సబ్ కలెక్టర్ ను వేడుకున్నా హన్మజిపేట్ రైతులు

బాన్సువాడ,(విజయక్రాంతి): బాన్సువాడ నియోజకవర్గంలోని హన్మజిపేట గ్రామ ప్రజలు శుక్రవారం  రైతులు సమావేశమై, గత రెండు రోజులుగా గ్రామ పెద్ద చెరువు కట్ట శిఖం భూమిలో ప్రైవేటు వ్యక్తులు చేస్తున్న కబ్జా పనులను గురించి చర్చించడం జరిగింది. ముఖ్యంగా పెద్ద చెరువు కట్టను జేసీబీలతో టిప్పర్లతో ముంపునకు గురి చేస్తూ సాగుకు అనుకూలంగా చెరువును ఆక్రమించుకోవడానికి  ప్రయత్నం చేస్తున్నారు. ఈ  శిఖం భూమిని ఖాబ్జదారులనుండి కాపాడి, అక్కడ చేపట్టే పనులను తక్షణమే పూర్తిగా ఆపించాలని  ఆయకట్టు రైతులు తీర్మానం చేశారు. ఈ తీర్మానం కాపీని సబ్ కలెక్టర్,  ఎమ్మార్వో,  ఇరిగేషన్ ఈఈ, డిఈలకు వినతి పత్రం అందజేశారు.