02-05-2025 10:54:50 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): బాన్సువాడ బిజెపి పట్టణ అధ్యక్షుడిగా తనకు అవకాశం కల్పించిన రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు బిజెపి బాన్సువాడ నియోజకవర్గం ఇంచార్జ్ ఎండల లక్ష్మీనారాయణ, భైసాబ్ కి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు అన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ. ఈ సందర్భంగా కోణాల గంగారెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో పట్టణ అధ్యక్షుడిగా అవకాశం కల్పించినందుకు, పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను కార్యకర్తలతో కలిసి పనిచేస్తానని ప్రజల సమస్యలపై ఉద్యమిస్తామని బాన్సువాడ పట్టణంలో బిజెపి పార్టీని మరింత బలోపేతం చేస్తానని కోరుచు.నేను గతంలో విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాటం చేసి ఏబీవీపీ బాన్సువాడ పట్టణ అధ్యక్షుడిగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేయడం జరిగింది తర్వాత బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరిగింది .