15 April, 2026 | 12:07 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

పర్యావరణాన్ని సైక్లింగ్ తో కాపాడుకోవాలి..

01-06-2025 06:18 PM

హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ నగరంలో ఈరోజు ఉదయం కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం మైభారత్ సంస్థ ఆధ్వర్యంలో, ఏజే పెడల్స్ అండ్ ట్రై సిటీ రైడర్స్ అనుసంధానంతో "ఫిట్ ఇండియా – సండేస్ ఆన్ సైకిల్" కార్యక్రమం భాగంగా సైకిల్ ర్యాలీ నిర్వహించబడింది. ఈ ర్యాలీని మై భారత్, ఏజే పెడల్స్, ట్రైసిటీ రైడర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించాయి. హంటర్ రోడ్ నుండి మై భారత్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ సమక్షంలో ప్రారంభమైన ఈ ర్యాలీ నగర సర్క్యూట్‌లో సాగింది. 

ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత, సైక్లింగ్ ప్రేమికులు, ఆరోగ్య కార్యకర్తలు, స్థానిక ప్రజలు, ఎన్‌ఎస్‌ఎస్ కిట్స్, వరంగల్ విద్యార్థులు, అలాగే ట్రైసిటీ రైడర్స్ అసోసియేషన్ నుండి చంద్రశేఖర్, ఏజే పెడల్స్ నుండి జయంత్, అవినాష్, నిఖిల సుమారు 100 మంది సైక్లిస్టులు ఈ ర్యాలీలో పాల్గొని, ఆరోగ్యపరమైన జీవనశైలిని ప్రోత్సహించారు. ఈ ర్యాలీ ప్రధానంగా ప్రజల్లో ఆరోగ్యపరమైన అలవాట్లను పెంపొందించడం, సైక్లింగ్ ద్వారా శారీరక దృఢత్వాన్ని సాధించడం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడడం లక్ష్యంగా నిర్వహించబడింది.