15 April, 2026 | 1:48 PM

Breaking News

ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •  

పోలీస్ సేవా పతకాలను ప్రకటించిన ప్రభుత్వం

01-06-2025 06:15 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోలీసుల సేవా పతకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలోని వివిధ విభాగాల అధికారులకు సేవా పతకాలను ప్రకటిస్తూ తెలంగాణ హోంశాఖ ప్రత్యేక పధాన కార్యదర్శి రవిగుప్తా ఆదివారం ఉత్తర్వులను జారీ చేసింది. 

అందులో 92 ఉత్తమ సేవ పతకాలు, 16 మహోన్నత సేవా పతకాలు, 47 కఠిన సేవా పతకాలు, పోలీసుశాఖలో పని చేసే గ్రేహౌండ్స్ విభాగానికి 9 శౌర్య పతకాలు, 461 సేవా పతకాలు, .

అవినీతి నిరోధక శాఖలో 1 మహోన్నత సేవా పతకం, 4 ఉత్తమ సేవా పతకాలు, మరో 17 సేవా పతకాలు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగంలో 1 ఉత్తమ సేవా పతకం, మరో 5 సాధారణ సేవా పతకాలు.

డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసులో 2 శౌర్య పతకాలు, 1 మహోన్నత సేవా పతకం, 3 ఉత్తమ సేవా పతకాలు, 14 సాధారణ సేవా పతకాలు.

స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగంలో 1 మహోన్నత సేవా పతకం, 3 ఉత్తమ సేవా పతకాలు, 15 సాధారణ సేవా పతకాలు.