11 May, 2026 | 10:50 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

దేవాదాయశాఖ అసైన్డ్ భూములను రక్షించండి

30-07-2025 12:36 AM

సీపీఎం ఆధ్వర్యంలో మంత్రి సీతక్కకు వినతి

 కామారెడ్డి, జూలై 29, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూములు దేవాలయ భూములు అసైన్డ్ భూములను కబ్జాల నుండి రక్షించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సిపిఎం ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కకు మంగళవారం వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కే చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల ప్రభుత్వ భూములు దేవాలయ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని రియల్ ఎస్టేట్ వారు కబ్జాలు చేస్తూ వెంచర్ల ఏర్పాటు చేస్తున్నారని అన్నారు.

బిక్నూర్ సిద్ధ రామేశ్వర టెంపుల్ సంబంధించిన వెయ్యి ఎకరాల భూమి, మాచారెడ్డి చౌరస్తా వెంకటేశ్వర టెంపుల్ భూములు ,నగర రామయ్య భూములతో పాటు జంగంపల్లి గ్రామంలో 1200 ఎకరాల అసైన్డ్ భూమి, దోమకొండ మండల కేంద్రంలోని దేవాదాయ శాఖ పరిధిలోని పలు  ఆలయాల భూములు  కబ్జాకు గురైన విషయం ప్రజలకు, నాయకులకు ,అధికారులకు  విధితమే  దీనిని వెంటనే చర్యలు తీసుకొని  రక్షించాలని మంత్రి ని కోరారు.

దేవాలయ భూముల ఆక్రమణ ల  వెనక రాజకీయ పలకుబడి ఉన్న నాయకులు ఉన్నారని వారి చెర నుండి భూముల సర్వే చేసి కాపాడాలని అన్నారు.అదేవిధంగా జిల్లాలో చెరువులు, కుంటలు కూడా కబ్జాలు చేస్తున్నారని జిల్లా అధికార యంత్రాంగం చూసి చూడనట్టు ఉంటుందని అన్నారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో అశోక్ నగర్, పాతరాజంపేట్ దగ్గర రైల్వే బ్రిడ్జిలను ఏర్పాటు చేయాలని ఆటోనగర్ ఏర్పాటు కోసం స్థలం కేటాయించాలని అన్నారు.

అదేవిధంగా జిల్లా కేంద్రంలో మధ్యలో ఆగిన సమీకృత మాంసం మార్కెట్ , కూరగాయల మార్కెట్ ని పున ప్రారంభించి త్వరితగతిన నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. వెంటనే పలు సమస్యలను పరిష్కరించాలని మంత్రివర్యులతో కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్ గౌడ్ ,మోతీరామ్ నాయక్ ,కొత్త నరసింహులు ,జిల్లా కమిటీ సభ్యులు ముదాం అరుణ్ లు పాల్గొన్నారు.