30-07-2025 12:36:41 AM
రాష్ట్ర మంత్రి సీతక్క
నార్సింగి (చేగుంట) జూలై 29 : రాష్ట్రంలో అబద్ధాలు చెప్పే పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్‌ఎస్ పార్టీ అని, ప్రజలకు అబద్ధాలు చెబుతూ కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తుందని రాష్ట్ర మంత్రి సీతక్క దుయ్యబట్టారు. మంగళవారం ఆమె హైదరాబాద్ నుండి కామారెడ్డి జిల్లా దోమకొండకు వెళ్తూ మార్గమధ్యలో మెదక్ జిల్లా నార్సింగి వద్ద ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి చెందిన అతిథి గృహంలో అల్పాహారం చేశారు.
ఈ సందర్భంగా విలేకరులతో మంత్రి మాట్లాడుతూ రాష్టంలో బిఆర్‌ఎస్ పార్టీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాష్టంలో వర్షాలు లేవంటారు, కానీ వరదలు ఎలా వస్తున్నాయో ఆ పార్టీ నేతలు చెప్పాలన్నారు.
మాజీ మంత్రి కేటీఆర్ అబద్దాలు మాట్లాడతారనేది ఎంపీ సీఎం రమేష్ మాటల్లోనే చూశామని, బీఆర్‌ఎస్ వాళ్లు ఎమ్మెల్యే ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్ శాతాన్ని ఎంపీ ఎన్నికల్లో ఎందుకు తెచ్చుకోలేదని కనీసం డిపాజిట్లు కూడా రాలేదన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ, బిఆర్‌ఎస్, పార్టీ లు కుమ్మక్కయ్యారని, ఇప్పటికైనా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ప్రతి పక్షాలు ముందుకు రావాలిమంత్రి కోరారు.