2 July, 2026 | 3:37 AM

సర్పంచ్ల సంఘం అధ్యక్షుడిగా బోడా వీరు నాయక్ ఎన్నిక

02-07-2026 02:30 AM

కూసుమంచి, జూలై 1 (విజయక్రాంతి): పాలేరు నియోజకవర్గం కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన మండల సర్పంచ్ల సంఘం సమావేశంలో ఏకగ్రీవంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడిగా బోడా వీరు నాయక్, ఉపాధ్యక్షులుగా: కొండా కృష్ణవేణి, వడిత్య వెంకటేష్ నాయక్, ప్రధాన కార్యదర్శి: మల్లెల స్వాతి, కోశాధికారి: లోడిగా నీలకంఠలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు బోడా వీరు నాయక్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, ఖమ్మం క్యాంపు కార్యాలయ ఇంచార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డికి, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఇంచార్జ్ భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డికి, మండల పార్టీ అధ్యక్షుడు బజ్జూరి వెంకటరెడ్డి కిహృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఇంచార్జ్ భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కూసుమంచి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బజ్జూరి వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ బానోత్ శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.