calender_icon.png 15 November, 2025 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవగాహనతోనే వరదలు, నీటి ముంపు నుంచి రక్షణ

15-11-2025 12:55:59 AM

  1. ఎన్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖ మాక్ డ్రిల్

సిరిసిల్ల మానేరు తీరంలో అవగాహన సదస్సు

రాజన్న సిరిసిల్ల,నవంబర్ 14(విజయక్రాంతి):అవగాహనతోనే వరదలు, నీటి ముంపు నుంచి రక్షణ పొందవచ్చని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పేర్కొన్నారు.కమ్యూనిటీ అవేర్ నెస్ లో భాగంగా భారత ప్రభుత్వం, హోమ్ శాఖ ఆదేశాల మేరకు ఎన్డీఆర్‌ఎఫ్ బెటాలియన్, సిరిసిల్ల అగ్నిమాపక శాఖ ఆద్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని మానేరు తీరంలో మాక్ డ్రిల్ నిర్వహించగా, ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా విహారయాత్ర లకు వెళ్లే పర్యాటకులు, సరదాగా నదీ తీరాల్లో విహరించే వారు, ఈత రాని వారు నీళ్ళల్లో మునిగి పోయినప్పుడు డ్రిల్ చూపించిన విధంగా చేస్తే ప్రాణాలు ఎలా కాపాడుకోవచ్చో వివరించారు. వరదలు సంభవించినప్పుడు, ఆకస్మాతుగా నీరు పట్టణాలు, గ్రామాల్లోకి వచ్చినప్పుడు అందుబాటులో ఉన్న ఖాళీ బాటిల్స్, క్యాన్స్, థెర్మాకోల్ షీట్స్, ప్లాస్టిక్ బిందెలు ఎండిన కొబ్బరి బొండాలు మొదలగునవి ఉపయోగించి నీటిలో తెలియాడే పద్దతులు తెలియజేశారు.

నీటిలో మునిగి పోతున్న వ్యక్తి ని ఎలా లాక్కు రావాలి అని వివిధ పద్దతులలో చూపించారు. బయటకు తీసుకు వచ్చిన వ్యక్తికి సీ పీ ఆర్, కృత్రిమ శ్వాస ఎలా కల్పించాలి, నీరు ఎలా బయటికి రప్పించాలో ప్రాక్టికల్ గా చూపించారు.అనంతరం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మాట్లాడారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఆపద సమయంలో ఎంతో మేలు చేస్తాయని తెలిపారు.

అవగాహన పొందిన వారు తమ కుటుంబ సభ్యులు, సమీప ప్రజలకు వివరించాలని పిలుపుఇచ్చారు. చాలా చక్కగా మాక్ డ్రిల్ చేసిన ఎన్డీఆర్‌ఎఫ్ బెటాలియన్, సిరిసిల్ల అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బందిని అభినందించారు.కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఎన్డీఆర్‌ఎఫ్ కమాండెంట్ గౌతం, జిల్లా అగ్ని మాపకశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, డీఏఓ అఫ్జల్ బేగం, సీపీఓ శ్రీనివాసాచారి, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య, అధికారులు, సిబ్బంది, ఎన్‌ఎస్‌ఎస్ స్టూడెంట్స్, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు.