calender_icon.png 10 December, 2025 | 7:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్టీపీ ప్లాంట్‌కు వ్యతిరేకంగా వంటావార్పు

08-12-2025 01:30:15 AM

అబ్దుల్లాపూర్‌మెట్, డిసెంబర్ 07: సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ వ్యతిరేకంగా పెద్ద అంబర్‌పేట్ గ్రామస్తులు,   పలు కాలనీల వాసులు నిరసనగా వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా, పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ ఈదుల చెరువు ఎఫ్‌టీఎల్ సర్వే నంబర్ 292లో తలపెట్టిన సీవరేజ్‌ట్రీట్‌మెంట్ ప్లాంట్  ఏర్పాటు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద అంబర్‌పేట్ గ్రామస్తులు, పలు కాలనీ వాసులతో  కలిసి గత వారం రోజుల నుంచి నిరసన, ధర్నా దీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఆదివారం వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ..  జనావాసల మధ్య సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మించొద్దన్నారు. ప్లాంట్ విషయంలో ప్రభుత్వం మొండికిపోవడం చాలా బాధాకరమన్నారు. మూసీ  పరివాహ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన ఎస్టీపీ ప్లాంట్‌ను జనావాసాల మధ్య ఏర్పాటు చేయడం వల్ల మానావాళ్ళకి, పశు సంపదకు ఎంతో హాని కలుగజేస్తుందన్నారు.

ఈ స్థలంలో ప్రజలకు ఉపయోగపడే పార్కులు, ప్రభుత్వ ఆఫీసులు కానీ, పాఠశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి  విజ్ఞప్తు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దంకి కృష్ణారెడ్డి, దండె రాజశేఖర్‌రెడ్డి, పండుగల రాజు, వడ్డేపల్లి విజేందర్‌రెడ్డి, గ్రామస్తులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.