4 March, 2026 | 10:07 PM

పండుగ వేళ విషాదం

04-03-2026 08:30 PM

కొబ్బరి చెట్టు పైనుండి జారిపడి చెంచు యువకుడు మృతి 

అచ్చంపేట: హోలీ పండుగ సందర్భంగా నల్లమోలలో విషాదం నెలకొంది. అమ్రాబాద్ మండలం మననూరులోని కాలనీలో పోచించు యువకుడు కొబ్బరి చెట్టు నుంచి జారి పడడంతో విగతజీవిగా మారాడు. గ్రామానికి చెందిన చెంచు యువకుడు కాళిదాసు (32) బుధవారం కొబ్బరికాయలు కోసేందుకు చెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు అక్కడి నుంచి జారిపడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యలో ధ్రువీకరించారు. బాధిత కుటుంబ సభ్యులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.