08-12-2025 01:31:31 AM
-ప్రపంచ ఉన్నత నగరాల స్థాయికి ఫ్యూచర్ సిటీ
-ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొంగులేటి
హైదరాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాం తి): సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో సోమ, మంగళవారాల్లో జరగనున్న గ్లోబల్ స మ్మిట్‌తో రాష్ట్రం దశదిశ మారుతుందని మంత్రి పొంగులే టి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఆయ న మీర్‌ఖాన్‌పేట్‌లో జరుగుతున్న సమ్మిట్ ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ... ఈ ప్రపంచ స్థాయి సమ్మేళనంతో ప్రపంచ నగరాల స్థాయికి ఫ్యూచర్ సిటీ చేరుతుందని అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం రెండేళ్ల పాలన, 2047 లక్ష్యంగా సాగుతున్న ప్రణాళికలు తదితరాలకు ఊతమిచ్చే విధంగా పెట్టుబడులు రానున్నాయని అన్నారు.
ఇప్పటికే విదేశాలకు చెందిన 150 మంది అత్యంత ప్రముఖులు ఈ సమ్మిట్‌లో పా ల్గొనబోతున్నారని చెప్పారు. రెండు రోజులపాటు జరిగే ఈ సమ్మేళనం కోసం విశేష రీ తిలో ఏర్పాట్లు జరిగాయని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.