5 May, 2026 | 1:57 PM

Breaking News

పదవ తరగతిలో ప్రతిభ చాటిన శాలివాహన విద్యార్థులకు ఘన అభినందనలు   •   దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌కు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •   వడదెబ్బతో బాలిక మృతి   •   మిషన్ భగీరథ నీరు సరిగా అందడం లేదు: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్   •   కన్నాలలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం   •   రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించాలి   •   లింగుపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   UAEపై దాడులు, భారతీయులకు గాయాలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన!   •   “ITP Aero – India” ప్లాంటుకు శ్రీధర్ బాబు శంకుస్థాపన   •  

యువత సద్వినియోగం చేసుకోవాలి

04-03-2026 08:18 PM

కాగజ్ నగర్,(విజయక్రాంతి): విక్సిత్ భారత్ యూత్ పార్లమెంట్ ప్రోగ్రామ్ బుధవారం గవర్నమెంట్ డిగ్రీ కళాశాల, కాగజ్ నగర్ లో విక్సిత్ భారత్ యూత్ పార్లమెంట్ పోటీలకు సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్  కి. శ్రీదేవి మాట్లాడుతూ... 50 సంవత్సరాల భారత దేశ అత్యవసర పరిస్థితి-భారత ప్రజాస్వామ్యాని కి పాఠాలు అనే విషయంపై ఈ పోటీలు నిర్వహిస్తున్నాం.

ఈ  పోటీలలో 18-25 వయస్సు గల వారు ఎవరైనా పాల్గొన వచ్చని ప్రతి వ్యక్తికి 3 నిమిషాలు సమయం ఇవ్వడం జరుగుతుందని ఈ పోటీలలో పాల్గొనే వ్యక్తులు మై భారత్ పోర్టల్ లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని లింక్ ద్వారా పాల్గొన వచ్చని, ఇందులో సెలెక్ట్ అయిన విజేతలు స్టేట్ లెవెల్, స్టేట్ లెవెల్ లో సెలెక్ట్ అయిన విజేతలు సెంట్రల్ లెవెల్ లో పోటీ చేయవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్.ప్రిన్సిపాల్ డా.లక్ష్మి నరసింహం, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ తూడూరు దత్తాత్రేయ, కళాశాల కోఆర్డినేటర్ దుర్గం జనార్దన్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్  శారద పాల్గొన్నారు.