calender_icon.png 21 January, 2026 | 6:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఉపాధి హామీ’ పేరు మార్పుపై నిరసన

21-01-2026 12:11:17 AM

ప్రధాని మోడీ దిష్టి బొమ్మ దహనం

చేవెళ్ల, జనవరి 20 (విజయక్రాంతి): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మారుస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి.

మంగళవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని ఆలూరు గ్రామంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ పిలుపుతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈ ఆందోళన నిర్వహించారు.

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర TUFIౄC కార్పొరేషన్ ఛైర్మన్ చల్లా నరసింహా రెడ్డి అధ్యక్షతన, చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా పేదల కడుపు నింపే ఉపాధి హామీ పథకం పేరు మార్చడం దుర్మార్గమన్నారు. కొత్తగా తీసుకొచ్చిన వీబీజీ రామ్ జీ (VBG Ramji) చట్టాన్ని తక్షణమే రద్దు చేసి, పథకానికి పాత పేరునే కొనసాగించాలని డిమాండ్ చేశారు.

నిరసన కార్యక్రమంలో ముదిరాజ్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్, రంగారెడ్డి జిల్లా మాజీ జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు వేణు గౌడ్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు సభ్యులు సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరి సతీష్ తో పాటు సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి, చేవెళ్ల మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెంట రెడ్డి,

వసంతం, సిద్ధేశ్వర, చేవెళ్ల మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, చేవెళ్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వీరేందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి, శంకర్పల్లి మండల అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, శంకర్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి, షాబాద్ మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నయ్య, ముడిమ్యాల్ ప్రతాప్ రెడ్డి, పడాల రాములు, పడాల ప్రభాకర్, తోల్కట్ట సత్యనారాయణ, మద్దూరి మల్లేష్తో పాటు భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.