21-01-2026 12:12:47 AM
కిక్కిరిసిన పుల్లూరు బండ జాతర
సిద్దిపేట రూరల్, జనవరి 20: మాఘ అమావాస్యను పురస్కరించుకుని పుల్లూరు బండపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న జాతర ఉత్సవాల్లో 3వ రోజు లక్ష్మీనరసింహ స్వామి క ళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తజన సంద్రంతో కిటకిటలాడింది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.