17 April, 2026 | 7:24 PM

సీపీఎస్ ని రద్దుచేసి డీఏను చెల్లించాలని నల్ల బ్యాడ్జీలతో నిరసన

17-04-2026 05:53 PM

ఆలేరు,(విజయశాంతి): సీపీఎస్ ని రద్దుచేసి డీఏను చెల్లించాలని టీజీఇ(జేఏసీ) పిలుపు మేరకు ఈ రోజు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన అన్ని సంఘాల మండల, జిల్లా రాష్ట్ర ప్రతినిధులు పాల్గొన్నారు. మండలం లోని ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ లంచ్ బ్రేక్ లో నల్ల బడ్జీలతో ఆలేరు మండల తహశీల్దార్ ఆఫీస్ నందు నిరసన తెలియజేయడం జరిగింది. అటు పిమ్మట జాక్ తరపున మెమొరాండం మండల తహశీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమం లో  తరపున రాష్ట్ర నాయకులు పసుపులేటి నరేంద్ర స్వామి, జిట్టబోయిన సైదులు, దూడల వెంకటేష్, బూషపాక రాములు, జిల్లా నాయకులు బొమ్మకంటి బాలరాజు, పూల నాగయ్య మండల నాయకులు దశమంత్ రెడ్డి, సయ్యద్,శంకర్, రాజేశ్వర్ ఉపాధ్యాయులు కుమారస్వామి, ఖాజా,  అలుగుబెల్లి హేమలత, రిశ్మా, తదితర ఉద్యోగ ఉపాధ్యాయులందరూ వెంటనే ప్రభుత్వం పీఆర్సీని అమలు చేయాలని, సీపీఎస్ ని రద్దు చేయాలి. డీఏ బకాయిలు అన్ని చెల్లించాలి, పెన్షన్ బకాయిలను రిటైర్మెంట్ అయిన వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాలని, ముక్త కంఠంతో నినదించటం  జరిగింది, పెద్ద ఎత్తున మండలంలోని  ఉద్యోగ,  ఉపాధ్యాయులు పాల్గొన్నారు.