17 April, 2026 | 7:08 PM

సీపీఆర్‌పై అవగాహన సదస్సు

17-04-2026 05:48 PM

జహీరాబాద్: అత్యవసర పరిస్థితులలో ప్రాణాలను కాపాడేందుకు కార్డియా అల్బినరి రిస సి టెస్టియన్ ఎంతగానో ఉపయోగపడుతుందని జహీరాబాద్ వైద్యులు తెలిపారు. శుక్రవారం నాడు జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్లో సీపీఆర్‌పై పోలీసులకు అంబులెన్స్ డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జహీరాబాద్ డివిజన్ డిఎస్పి సైదా నాయక్ ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ఐదవ రోజు సీపీఆర్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న బాలాజీ హాస్పిటల్, సండ్రోయ్ హాస్పిటల్ వైద్యులు పాల్గొన్నారు. గుండెపోటు వంటి అత్యవసర సమయంలో ఆసుపత్రికి చర్యలోపు మొదటి కొన్ని నిమిషాలు ఎంతో ప్రాముఖ్యమైనవని ఆ సమయంలో ప్రాణాలను కాపాడేందుకు సిపిఆర్ ఎంతగానో ఉపయోగపడుతుందని వారు వివరించారు.

సరైన పరిస్థితిలో చాచిపై ఒత్తిడి కలిగించడం ద్వారా మెదడుకు ఇతర ముఖ్య అవయవాలకు రక్త ప్రసరణ ఎలా జరుగుతుందో డాక్టర్లువివరించారు. మొదటిసారిగా ప్రమాదం జరిగినప్పుడు అంబులెన్స్ డ్రైవర్లు పోలీస్ సిబ్బంది ప్రసమంగా స్పందిస్తున్నందున వీరికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని దీని ద్వారా ప్రజల ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారని డాక్టర్లు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో 15 మంది అంబులెన్స్ డ్రైవర్ తో పాటు పోలీస్ సిబ్బందికి సిపిఆర్ పై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బాలాజీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సమద్ మేనేజర్ కుమార్ సన్ రోహి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ఆమెన్ పట్టణ ఎస్సై కే వినయ్ కుమార్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.