10 April, 2026 | 5:27 PM

Breaking News

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి   •   గల్ఫ్ బాధితుల కోసం అడ్వైజరీ కమిటీ ఏర్పాటు   •   సంపూర్ణ ఆరోగ్యం యోగతోనే సాధ్యం - జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   చేనేత కార్మికుల ఆత్మగౌరవానికి అండగా నిలుస్తాం   •   శ్రీ భక్తంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు   •   రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం   •   రహదారి ప్రమాదాలు నివారణకు చర్యలు   •   పశువులలో గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం   •   అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహణ   •   ఉపాధి హామీ పనులతో చిన్నలింగపూర్ గ్రామానికి కొత్త ఊపిరి   •  

మూడో రోజుకు చేరిన నిరసనలు

07-02-2025 03:34 PM

డంప్ యార్డ్ కు వ్యతిరేకంగా కొనసాగుతున్న నల్లవల్లి, ప్యారనగర్ గ్రామస్తుల ధర్నా, ఆందోళనలు

పోలీస్ ల భారీ బందోబస్తు

పటాన్ చెరు,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్‌లో డంప్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నల్లవల్లి, ప్యారానగర్, గుమ్మడిదల మండల ప్రజలు చేస్తున్న ఆందోళనలు మూడో రోజుకు చేరాయి. శుక్రవారం నల్లవల్లి గ్రామంలో గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన  చేపట్టారు. డంప్ యార్డ్ ఏర్పాటును నిలిపేయాలని డిమాండ్ చేశారు. ప్యారానగర్, నల్లవల్లి గ్రామాలను కాపాడాలని...పంటలను, పర్యావరణాన్ని రక్షించాలని నినాదాలు చేశారు. పోలీస్ లు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాలానగర్ - మెదక్ జాతీయ రహదారిపై నల్లవల్లి చౌరస్తాలో పోలీస్ బలగాలు భారీగా మొహరించాయి.