10 April, 2026 | 3:23 PM

Breaking News

ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •   క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు   •   ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం   •   అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •  

ఆరు గ్యారంటీల జాడేది..

07-02-2025 04:30 PM

న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరు మధు..

చర్ల (విజయక్రాంతి): కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకొచ్చే ముందు ఆరు గ్యారంటీలను ప్రజలకు ఇచ్చింది, అధికారంలోకి వచ్చిన 100 రోజులల్లో ప్రకటించింది. ఈ ఆరు గ్యారంటీని అమలు చేస్తానని చెప్పి ఇందులో ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదు. ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం అంటూ తెలంగాణ ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు చేసిన వాగ్దానాలు సంవత్సరంకుపైగా అవుతున్న ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లు తయారైంది తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుబంధు 15000 ఇస్తానని ఇది అమలు చేయలేదు. పంట రుణాలను సగం మందికి ఇచ్చి చేతులు దులుపుకుందని కౌలు రైతులకు రైతు హక్కులను గుర్తించి అమలు చేస్తానని చేసిన వాగ్దానాలను తుంగలో తొక్కింది ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తానని ఏ ఒక్క చోట కూడా అమలు చేయలేదు పేదవాడికి వైద్యం అందించడంలో వైపర్యత చెందింది మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2500 ప్రకటించింది అమలు చేయలేదు.

యువ వికాసం పేరిట విద్యార్థులకు ఇస్తామన్న 5 లక్షల విద్యా భరోసా కార్డు భరోసా పథకాన్ని వెంటనే ప్రారంభించడంలో వైఫల్యత చెందింది రాజు ఆరోగ్యశ్రీ పథకం అంతట అమలు చేస్తానని చేసిన వాగ్దానాన్ని తుంగలో తొక్కింది అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వడంలో వైఫల్యం చెందిందని ఆరు గారంటీలతో పాటు ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ఈ 6 గ్యారంటీ అమలుకై సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ చలో హైదరాబాద్ ఈనెల 20న కదిలి రమ్మని ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా ఈ ప్రెస్ మీట్ నిర్వహించాం హైదరాబాద్ కార్యక్రమం జయప్రదం కోరుతూ ఈనెల 11న వ్యక్తిగత దరఖాస్తులతోని చర్ల ఎమ్మార్వో ఆఫీస్ కి కదిలి రావాల్సిందిగా ప్రజల్ని కోరుతున్నాం అంటూ పిలుపునిచ్చారు.