6 July, 2026 | 2:01 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

28-03-2025 12:52 AM

వనపర్తి, మార్చి 27 ( విజయక్రాంతి ) : ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదర్శించారు. గురువారం కలెక్టర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ఆస్పత్రిలో రోగులకు కావాల్సిన వసతులపై కలెక్టర్ ఆరా తీశారు. ఆస్పత్రికి వచ్చే బాలింతలు, తల్లులు పిల్లలకి ఫీడింగ్ ఇవ్వడానికి ఒక ప్రత్యేక గది ఏర్పాటు చేయాలని సూచించారు.

ఆస్పత్రిలో ప్రారంభించిన కంటి శస్త్ర చికిత్స విభాగంలో సేవలను  మెరుగుపరచాలని కలెక్టర్ సూచించారు. ఎన్ సి డి క్లినిక్ ను, అదేవిధంగా, మైత్రి ట్రాన్స్( ట్రాన్స్ జెండర్) క్లినిక్ ను కలెక్టర్ తనిఖీ చేశారు.

అనంతరం ఆస్పత్రిలో రోగులకు ప్రశాంతమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించేలా ఖాళీ ప్రదేశాల్లో కొన్ని మొక్కలు నాటించే ఏర్పాట్లు చేయాలని సూచించారు.సిటీ స్కాన్ ఏర్పాటు కోసం సిద్ధం చేస్తున్న గదిని పరిశీలించి టీజీ ఎస్ ఎమ్ ఐ డి సి ఇంజనీరింగ్ విభాగం డిఈకి పలు సూచనలు చేశారు. అనంతరం, డయాలసిస్ విభాగాన్ని సందర్శించిన కలెక్టర్ రోగులకు ఏ విధంగా చికిత్స అందిస్తున్నారు, వారికి కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. 

 జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనుల తనిఖీ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ నిర్మాణ పనులను కలెక్టర్ గురువారం తనిఖీ చేశారు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో నిర్మాణంలో ఉన్న రెండు లెక్చర్ హాల్స్ ని నెల రోజుల్లోపు పూర్తి చేసి అప్పగించాలని ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.

అదేవిధంగా హాస్టల్ భవనాలను సందర్శించిన కలెక్టర్ నెలన్నర లోపు పూర్తి చేసి విద్యార్థులకు వసతి కల్పించేందుకు అప్పగించాలని ఆదేశించారు. ఇక అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ మొత్తం ఆగస్టు లోపు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. 

ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి  సూపరిండెంట్ డాక్టర్ రంగారావు, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కిరణ్మయి, ఎన్ సి డి డాక్టర్ రామచంద్ర, ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.