11-11-2025 12:00:00 AM
- ఏటూరునాగారం డిప్యూటీ డిఎంహెచ్‌ఓ డాక్టర్ క్రాంతికుమార్
- పాము కాటుతో బాలుడి మృతి సంఘటనపై కన్నాయిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందితో విచారణ
కన్నాయిగూడెం,నవంబరు10(విజయక్రాంతి):ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో పాము కాటుతో బాలుడి మృతి సంఘటన విషయంపై కన్నాయిగూడెం ప్రాథమిక వైద్యశాలను ఏటూరునాగారం డిప్యూటీ డిఎంహెచ్‌ఓ డాక్టర్ క్రాంతికుమార్ విచారణ చేపట్టారు కన్నాయిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని మందుల స్టాక్,స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. పీహెచ్సీ స్టాఫ్ ను విచారించి లిఖితపూర్వక వివరణ తీసుకున్నారు.
ఈ సందర్భంగాఏటూరునాగారం డిప్యూటీ డిఎంహెచ్‌ఓ డాక్టర్ క్రాంతికుమార్ వైద్యులు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి అంకితభావంతో, నిబద్ధతతో పనిచేయాలి. దీనిలో రోగులతో దయగా వ్యవహరించడం,క్షేత్రస్థాయిలో పర్యటించడం,సమయపాలన పాటించడం, మరియు అనారోగ్యాల నివారణకు అవగాహన కల్పించడం వంటివి చేస్తుండాలని ప్రభుత్వ ఆరోగ్య పథకాలను విజయవంతంగా అమలు చేయడం మరియు ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం వైద్యుల బాధ్యత రోగులతో సానుభూతి రోగులను ఆప్యాయంగా పలకరించి, వారికి సరైన వైద్య సేవలు అందించాలి.
ప్రాథమిక ప్రథమ చికిత్స అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించి, ప్రాథమిక చికిత్స అందించాలి.సమయపాలన మరియు పర్యటనలు సమయానికి వైద్యశాలకు హాజరు కావడంతో పాటు, క్షేత్రస్థాయి పర్యటనలను క్రమం తప్పకుండా చేయాలని అన్నారు ఈకార్యక్రమంలో ఎంసిహెచ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గిరి,ఫార్మసిస్ట్ శారద,స్టాఫ్ నర్స్ ప్రశాంతి,సుమలత,ల్యాబ్ టెక్నీషియన్ సురేష్ పాల్గొన్నారు.