8 May, 2026 | 1:05 AM

నామినేటెడ్ పదవుల్లో యువజన కాంగ్రెస్‌కు చోటు కల్పించండి

08-05-2026 12:00 AM

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు విన్నతి

రంగారెడ్డి, మే 7(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తున్న నామినేటెడ్ పదవుల్లో యువజన కాంగ్రెస్ నాయకులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పాలకూర్ల రవికాంత్ గౌడ్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను కోరారు.

గురువారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసీ.. పార్టీ కోసం కష్టపడుతున్న యువ నాయకులను నామినేటెడ్ పదవుల ద్వారా ప్రోత్సహించాలని రవికాంత్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. దీనికి పీసీసీ చీఫ్ సానుకూలంగా స్పందించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, నామినేటెడ్ పదవుల్లో అర్హులైన వారందరికీ తప్పకుండా అవకాశం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.