calender_icon.png 7 July, 2025 | 3:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రవాణా సౌకర్యం కల్పించండి

05-07-2025 12:00:00 AM

రోడ్డెక్కి ధర్నా చేసిన సోమిని గ్రామ ప్రజలు

బెజ్జూర్ ,జులై4 (విజయ క్రాంతి ): ప్రభుత్వాలు ఎన్ని మారిన మా బతుకులు మారడం లేదని సోమిని గ్రామ ప్రజలు నిరసన తెలిపారు. బెజ్జూరు మండలంలోని సోమిని గ్రామ ప్రజలు గిరిజన గ్రామాలకు రవాణా సమస్య పరిష్కారం చేయాలని ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నైతం రాజు మాట్లాడుతూ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక ఏటా వర్షాకాలం వస్తే  తీవ్ర ఇబ్బంది కలుగుతోందని అన్నారు.

కనీసం అంబులెన్సు కూడా రాలేని పరిస్థితి ఉందని మండిపడ్డారు. వర్షాకాలం వస్తే పాముకాటు గురైతే ఆసుపత్రికీ చేరకుండానే ప్రాణాలు పోయిన ఘటన లు ఎన్నో జరిగినట్లు తెలిపారు. గర్భిణీల పరిస్థితి అయితే చాలా దారుణం గా ఉంది. ఎడ్ల బండిలో లేదా డోలి కట్టి బెజ్జురు ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అడవి మధ్యలో రెండు లో లెవెల్  ఒర్రెలు ఉండటం వలన చిన్నపాటి వర్షానికే ఉప్పొంగడం వల్ల చుట్టు పక్క గ్రామాలతో సంబంధం తెగి నిత్యావసర సరుకులు కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఉంద ని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజా ప్రతినిధులు, అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్డు సౌకర్యం కల్పించా లని గ్రామస్తులు కోరుతున్నారు.ఈ  కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి ఆత్రం సాయన్న, గ్రామస్తులు  చంద్రశేఖర్, అలం పెంటయ్య, రామన్న, గ్రామ ప్రజలు పాల్గొన్నారు..