అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి
04-07-2025 11:31 PM
సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి
భద్రాచలం,(విజయక్రాంతి): దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రాణాలర్పించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా అల్లూరి విగ్రహానికి ఎంబి నర్సారెడ్డి పూలమాల వేసిన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అల్లూరి స్ఫూర్తితో ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు నిచ్చారు. అల్లూరి సీతారామరాజు ఏ ఆశయం కోసం అయితే పోరాడారు అందుకు కృషి చేయటమే వారికి మనం అర్పించే నిజమైన నివాళి అని అన్నారు.






