05-07-2025 12:00:00 AM
వనపర్తి టౌన్ జూలై 4: విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదిగి తాము చదివిన పాఠశాల, కళాశాలతో పా టు తమ భవిష్యత్తు కో సం సహకరిస్తున్న ప్రభుత్వానికి కూడా మంచి పే రు తేవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలోని నాగవరం లో ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల జూనియర్, డిగ్రీ కళాశాలలను,మరికుంట లో ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను,అదేవిధంగా సాయి నగర్లోని బాలుర మైనారిటీ సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల,వల్లబ్ నగర్ లోని మైనారిటీ సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలను సందర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఆయా గురుకులాల్లోని వసతి గృహాల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే విషయాలను ఆరా తీశారు. విద్యార్థులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని,అట్టి విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలియజేయాలని ప్రిన్సిపాల్ కి సూచించారు.
ప్రయోగాత్మక విధానంతో మెరుగైన ఫలితాలు
నాగవరంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాలలో కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదిగి తాము చదివిన పాఠశాల,కళాశాలతో పాటు తమ భవిష్యత్తు కోసం సహకరిస్తున్న ప్రభుత్వానికి కూడా మంచి పేరు తేవాలని అన్నారు. ప్రయోగాత్మక విధానంతో పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడం ద్వారా సులువుగా నేర్చుకోవడమే కాకుండా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని చెప్పారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కళాశాలకు చెందిన విద్యార్థులు కళాశాలలోనే మిల్కీ వైట్ మష్రూమ్ పం డించడాన్ని పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులను అభినందించారు.ఇటువంటి ప్రయోగాత్మక విధానాలను ఇంకా ముందుకు తీసుకువెళ్లాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ ఉమా దేవి, మైనారిటీ శాఖ అధికారి అఫ్జాలుద్దీన్, ఆయా గురుకులాల ప్రిన్సిపాల్ లు సరస్వతి, విజయలక్ష్మి తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.