15 April, 2026 | 12:59 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

స్నేహితుడి కుటుంబానికి రూ. 25 వేలు అందజేత

14-04-2025 09:31 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): పదో తరగతి వరకు తమతో కలిసి చదువుకున్న మిత్రుడు అకాల మృత్యువాత పడగా అతని కుటుంబానికి క్లాస్మేట్స్ 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం అయ్యగారి పల్లిలో జరిగింది. ఇనుగుర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో 1986 - 87 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థి గొంగళ్ల వెంకన్న అనారోగ్యంతో మృతి చెందాడు. అతనితో కలిసి చదువుకున్న క్లాస్మేట్స్  వద్దిరాజు చంద్రప్రకాష్, గంజి శ్రీనివాస్ రెడ్డి, కన్న సాంబయ్య, పరుపాటి వెంకన్న, బేతమళ్ళ భారతి, మార్క శ్యామ్, పబ్బ విజయ్, గండు రమేష్, కొమ్మన బోయిన ఐలయ్య , మాలోత్ రాములు నాయక్, వేముల పల్లి శ్రీరాములు తదితరులు కలిసి సమకూర్చిన 25వేల రూపాయల నగదు, 50 కేజీల బియ్యం మిత్రుని కుటుంబానికి అందజేశారు.