calender_icon.png 28 January, 2026 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యమైన వైద్య సేవలే ప్రభుత్వ లక్ష్యం

28-01-2026 12:00:00 AM

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి                       

నల్లగొండ టౌన్, జనవరి 27(విజయక్రాంతి): ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను సులభంగా, వేగంగా అందించాలనే లక్ష్యం తో రూ.30 లక్షలతో ఏర్పాటు చేసిన హెల్త్ ఏటీఎం ప్రైమ్ టేర్ మిషన్, ఈసీజీ మిషన్‌ను రాష్ట్ర రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. మంగళవారం జిల్లా ప్రభుత్వ కేంద్ర ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ విభాగంలో అత్యాధునిక మిషన్స్‌ను ప్రారంభించిన అనం తరం ఆయన మాట్లాడారు.

పేద, మధ్యతరగతి ప్రజలు ఖరీదైన ఆసుపత్రులకు వెళ్ల కుండానే ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేయించుకునే అవకాశం కలుగుతుందని అన్నా రు. ఈ హెల్త్ ఎటిఎంలో ఈసీజీ, బీపీ, బ్లడ్ షుగ ర్, పల్స్, బాడీ టెంపరేచర్, ఆక్సిజన్ సాచ్యురేషన్ వంటి పరీక్షలు తక్కువ సమయంలో నిర్వహించవచ్చన్నారు.  ఈ కార్యక్రమంలో కలెక్టర్ చంద్రశేఖర్, రెవిన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఎమ్మె ల్సీ శంకర్‌నాయక్, ఎస్పీ శరత్‌చంద్ర, ఇన్‌చార్జి కలెక్టర్ అశోక్‌రె డ్డి, సూపరింటెండెంట్ నేత నరసింహారావు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకు లు పాల్గొన్నారు.