calender_icon.png 28 January, 2026 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతా ‘సర్వే’ అంతర్యామి!

28-01-2026 12:00:00 AM

మోగిన మున్సిపల్ ఎన్నికల నగారా

నేటి నుండే నామినేషన్ దాఖలకు ఏర్పాట్లు సిద్ధం

రిజర్వేషన్లు ఖరారు.. ఒక్కో స్థానానికి పదుల సంఖ్యలో పోటీ

పార్టీ టికెట్ కోసం ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ

రాజకీయ నేతల చుట్టూ బీఫామ్ కోసం ప్రదక్షిణలు

ప్రజాబలం ఉన్నా ఫలితం సున్నా..

జెండా ఎజెండా జాంతానై.. సర్వే ఆధారంగానే పార్టీ టికెట్లకు పచ్చ జెండా

జనరల్ స్థానాల్లో కోట్లు కుమ్మరించేందుకు సిద్ధపడుతున్న అభ్యర్థులు

నాగర్ కర్నూల్ జనవరి 27 (విజయక్రాంతి): ఎప్పుడు ఎప్పుడా అని ఎదు రుచూస్తున్న మున్సిపల్ ఎన్నికలు రానే వచ్చాయి. మంగళవారం రాష్ట్ర ఎన్నికల సం ఘం మున్సిపల్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. వచ్చే నెల 11న పోలింగ్ 13న కౌంటింగ్ నిర్వహించేందుకు నేటి నుండే ఆశావాహుల నుండి నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన ట్లు ప్రకటించింది. ఇప్పటికే ఆయా వార్డుల వారీగా తుది ఓటరు జాబితాతో పాటు,  రిజర్వేషన్లు కూడా ఖరారు పూర్తయింది. కౌన్సిల్ ఛాంబర్లో కాలు మోపేందుకు ప్రజలతో మ మేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ తోచిన విధంగా సహాయపడుతూ ప్రజాదర ణ కూడగట్టుకున్న అభ్యర్థులకు చివరికి టి కెట్టు దక్కుతుందా లేదా అన్న ఆందోళన నెలకొంది.

ఎలాగైనా టికెట్ సాధించి ఎన్నికల బరిలో నిలిచేందుకు సమాయత్తమ వు తున్న అభ్యర్థులు ఆయా పార్టీ నేతల చుట్టూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా రు. మరి కొంతమంది అభ్యర్థులు తమ రాజకీయ పలుకుబడితో టికెట్ కోసం స్థానిక నేతలఫై తీవ్ర ఒత్తిళ్లు తెస్తున్నారు. కల్వకుర్తి మున్సిపల్ పీఠం జనరల్ మహిళ రిజల్ట్ కా వడంతో ఆ సీటు దక్కించుకోవడం కోసం మహిళా రిజర్వేషన్ ఉన్న వార్డుల్లో పోటీ భా రీగా నెలకొంది. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ లోను చైర్మన్ పీఠం బీసీ జనరల్ కావ డంతో ఆయా వార్డుల్లో రిజర్వేషన్ దక్కిన స్థానాల్లో పోటీ తీవ్రంగా నెలకొంది.

జనరల్ స్థానాల్లోనూ ఉన్నత వర్గాలకు చెందిన లీడ ర్లు పోటీ పడుతున్నారు. కోట్లు కుమ్మరించైన కౌన్సిల్ సీటు దక్కించుకోవడం కోసం పావు లు కదుపుతున్నారు. అందుకోసం టికెట్ ఎవరికి దక్కుతుందా అన్న ఉత్కంఠ నెలకొం ది. కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం బీసీ మహిళకు కేటాయించడంతో ఆయా వార్డులోని బీసీ మహిళా రిజర్వేషన్ దక్కిన వార్డు ల్లో పోటీ ఉత్కంఠ నెలకొంది. అధికార కాం గ్రెస్, ప్రతిపక్ష బిఆర్‌ఎస్ పార్టీ నేతలు సైతం గెలుపు గుర్రాల కోసం వేట సాగిస్తున్నారు. ఆయా వార్డుల్లో ప్రైవేటు సర్వే సంస్థల చేత గెలిచే అభ్యర్థుల కోసం సర్వేలు చేయించారు.

అభ్యర్థుల ఎంపిక మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిపేందుకు అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బిఆర్‌ఎస్ పార్టీ ప్రత్యేకించి ఇన్చార్జిలను నియమించింది. కల్వకుర్తి,  కొ ల్లాపూర్, నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో అధికార కాంగ్రెస్ పార్టీకే అత్యధికంగా సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా నిఘా వర్గాల ద్వారా సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. అందుకు తగినట్లు ఒక్కో వార్డు లో అధికార కాంగ్రెస్,  బిఆర్‌ఎస్ పార్టీలో పదుల సంఖ్యలో ఉన్న ఆశావహుల లిస్టును క్రోడీకరించేందుకు ఆయా పార్టీ ముఖ్య నేతలు తలమునకలవుతున్నారు.

ప్రతి ఒక్కరికి సానుకూలంగానే స్పందిస్తూ సర్వే ఆధా రంగానే టికెట్లు దక్కుతాయని తెగేసి చెప్తున్నారు. కానీ ఒక అడుగు ముందుకేసి బిఆర్ ఎస్ పార్టీ ఇప్పటికే పలు వార్డుల్లో అభ్యర్థులను కూడా ఖరారు చేసింది. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న కొద్ది భారీగా వలసలు పెరుగుతున్న నేపథ్యంలో మరి కొన్ని వాటి ల్లో అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి లేకపోవడం విశేషం. ప్రజాబలం ఉన్నప్పటికీ ఎన్ని కల ఖర్చులు భారీగా పెరిగాయని ఖర్చులకు వెనుకాడకుండా ముందుకొచ్చే వారిని సెలెక్ట్ చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ఈ నేపథ్యంలో ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో అదే పార్టీని నమ్ముకొని పార్టీ జెండా, ఎజెండాలను భుజాన మోసిన నిక్సాన కార్యకర్తలకు మాత్రం భంగపాటు తప్పేలా లేదని తెలుస్తోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇతర పార్టీల నుండి జంప్ చేసిన అభ్యర్థులకు టికెట్టు ఇవ్వడం పట్ల ఆయా పార్టీలోని నిక్సాన లీడర్లు తీవ్ర మనోవేదనకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో టిఆర్‌ఎస్ పార్టీలో బలమైన గెలవగలిగే సత్తా ఉన్న వ్యక్తులపైనే దృష్టి సారించి వారిని అధికార పార్టీల్లోకి లాగి టికెట్ ఇస్తున్నట్లు తద్వారా ప్రతిపక్ష టిఆర్‌ఎస్ పార్టీకి అభ్యర్థులే కరువు అవుతున్న పరిస్థితి ఏర్పడింది. సర్వే ఆధారంగా టికెట్లు కేటాయింపు జరిగితే తప్పని సరి అధికార పార్టీ నష్టపోయే పరిస్థితి ఉందని నిఘా వర్గాలు చెబుతున్నాయి.