02-11-2025 12:34:41 AM
హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాం తి): పీఆర్టీయూ టీఎస్ 36వ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం హైదరాబాద్‌లోని జిల్లెలగూడలో నిర్వహిస్తున్నట్లు పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షం గౌడ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీచర్ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి, మాజీఎమ్మెల్సీ బీ.మోహన్ రెడ్డితోపాటు 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, దాదాపు రెండువేల మంది ఉపాధ్యాయులు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో విద్యా, ఉపాధ్యాయ రంగ సమస్యలపై చర్చించనున్నారు.