28 February, 2026 | 6:06 AM

సైకో మైథలాజికల్ థ్రిల్లర్ అరి

06-10-2025 12:41 AM

వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీ కాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ’అరి’. ఈ చిత్రానికి ’మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. ’పేపర్ బాయ్’ చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చు కున్న జయశంకర్ వంగ దర్శకత్వంలో ఈ సినిమా రూపొం దుతోంది. ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, శేషురెడ్డి మారంరెడ్డి, డాక్టర్ తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ఏషియన్ సురేశ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 10న వరల్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఆదివారం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. సైకలాజికల్, మైథలాజికల్ ఎలిమెంట్స్ కలిసి ఓ డిఫరెంట్ థ్రిల్లర్ మూవీగా ‘అరి’ ఉండబోతున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఒక లైబ్రరీ, అక్కడ రివీల్ అయ్యే ఏడు జీవితాలను ఆసక్తికరంగా చూపించారు.

’భూలోకంలో జన్మించాలని శ్రీకృష్ణుడు సంకల్పించగానే ఆ విషయం స్వర్గలోకంలో తెలిసి ఆరుగురు దేవతలు తమనూ భూలోకం తీసుకెళ్లమని శ్రీకృష్ణుడిని వేడుకున్నారు. అవే అరిషడ్వర్గాలు.. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు..’ అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఇక్కడ అందరి కోర్కెలు తీర్చబడును అని ఓ యూనివర్సిటీ లైబ్రరీ నుంచి వెలువడిన ప్రకటన చూసి సినిమాలోని ప్రధాన పాత్రధారులు వచ్చి తమ కోర్కెలు చెబు తుంటారు.

ఈ ప్రపంచంలో మనషులందరిలో ఉండే అరిషడ్వర్గాలకు వారి కోర్కెలు ప్రతీకలుగా కనిపిస్తాయి. ఈ పాత్రధారుల నేపథ్యం ఏంటి?.. అం దరి కోర్కెలు తీర్చే బాధ్యతను తీసుకున్నది ఎవరు?.. ఎం దుకు? తన దగ్గరకు వచ్చే వారికి ఆయ న ఇచ్చే టాస్క్ ఏం టి? అనేదే సినిమా. ’పరిత్రాణాయ సాధూనాం..’ అనే భగవద్గీత శ్లోకంతో ట్రైలర్ పూర్తవుతుంది. ఈ చిత్రానికి సంగీతం: అనుప్ రూబెన్స్; గీత సాహిత్యం: కాసర్ల శ్యామ్, వనమాలి, కళ్యాణ్ చక్రవర్తి; సినిమాటోగ్రఫీ: కృష్ణ ప్రసాద్, శివశంకర వరప్రసాద్; ఎడిటర్: జీ అవినాష్; ప్రొడక్షన్ డిజైన్: రాజీవ్ నాయర్.