28 February, 2026 | 7:43 AM

చెన్నై వేదికగా తారల రీయూనియన్

06-10-2025 12:42 AM

చెన్నై వేదికగా శనివారం దక్షిణాది చలన చిత్ర పరిశ్రమ ‘80స్’ స్టార్స్ రీయూనియన్’ జరిగింది. దశాబ్దాల నుంచి సినీ రంగంలో ఉంటూ స్టార్స్‌గా ఎదిగిన చిరంజీవి, వెంకటేష్, జాకీ ష్రాఫ్, శరత్‌కుమార్, రాజ్‌కుమార్ సేతుపతి, శ్రీప్రియ, నదియా, రాధ, సుహాసిని, రమ్యకృష్ణ, జయసుధ, సుమలత, రెహమాన్, ఖుష్బూ, భాగ్యరాజ్, పూర్ణిమ భాగ్యరాజ్, లిస్సీ, నరేష్, సురేష్, శోభన, మేనక, రేవతి, ప్రభు, జయరాం, అశ్వతీ జయరామ్, సరిత, బాను చందర్, మీనా, లత, స్వప్న, జయశ్రీ రీయూనియన్‌లో భాగస్వాములయ్యారు. 

రాజ్‌కుమార్ సేతుపతి, శ్రీప్రియ దంపతులు తారలకు ఆతిథ్యమిచ్చారు. లిస్సీ లక్ష్మి, పూర్ణిమ భగ్యరాజ్, ఖుష్బూ సుందర్, సుహాసిని మణిరత్నం కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. తారలందరికీ ఈ ఈవెంట్ మరపురాని ఉద్వేగభరిత జ్ఞాపకంగా నిలిచింది. గతేడాది భారీ వర్షాలు, వరదల కారణంగా రీయూనియన్ జరగలేదు. ఈసారి మాత్రం తారలందూ అదరగొట్టారు. మరోసారి వారి మధ్య ఉన్న స్నేహ బాంధవ్యాలను గుర్తుచేసుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, జాకీ ష్రాఫ్, ప్రభు వంటి అగ్ర నటులు ఒకే వేదికపెకిై వచ్చి పాత జ్ఞాపకాలను, అనుభవాలను నెమరువేసుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భం గురించి మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. ‘రీయూనియన్ పేరిట స్నేహితులతో ఆనంద క్షణాలు గడిపా. నవ్వులు, ఆప్యాయతలు, పాత జ్ఞాపకాలు తలుచుకుంటూ మైమరిచపోయాం. ఆనందంతో మా మనసులు ఉప్పొంగాయి’ అని రాసుకొచ్చారు.