చెరువు శిఖంలో ఆక్రమణలు
అధికారుల సమన్వయ లోపం
కుదించకపోతున్న నీటి చెరువులు
భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం
ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకుంటున్న అధికారులు
నిర్మల్. మార్చి 6 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని గొలుసు కట్టు చెరువుల్లో అక్రమాలపర్వం కొనసాగుతుం ది. చెరువు శిఖమములో కొందరు ఆక్రమించుకొని అక్రమ ప్లాట్లు వెంచర్లు తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసుకుంటున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు.
నిర్మల్ పట్టణాన్ని పరిపాలించిన నిమ్మల నాయుడు కాలంలో నిర్మించిన చెరువులో అక్రమ పట్టాల పట్టాలను సృష్టించి కోట్ల విలువచేసే ప్రభుత్వ భూములను కాజేస్తున్నారు. అధికారులు శిఖం భూములపై వ్యక్తిగతంగా ఫిర్యా దు చేసిన తప్ప రక్షణ చర్యలు తీసుకోవడం లేదు. రెవిన్యూ మున్సిపల్ నీటిపారుదల శాఖ అధికారుల సమన్వయ లోపం ఎఫ్ టి ఎల్ బఫర్ బఫర్ జోన్ ప్రాంతాల్లో కొందరు రాజకీయ పలుకుబడి ఉన్న నేతలు ఉద్యోగులు సమీప కాలనీవాసులు పాల్పడుతు న్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి.
చెరువు శిఖం భూముల ఆక్రమణలపై రెండు సంవత్సరాల క్రితమే జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో కొందరు న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు హైకోర్టులో పిటిషన్ వేసిన సందర్భా లు ఉన్నాయి. నిర్మల్ పట్టణంలోని 17 శతాబ్దంలో గొలుసుకట్టు చెరువులను నిర్మించా రు. పట్టణంలోని బంగల్పేట్. వెంకటాద్రిపేట్ కోరన్నపేట్ మోతీ తలాబ్ మంజులా పూర్ చెరువు కట్ట. కంచరొడి కట్ట పల్లె చెరువు. ధర్మసాగర్ తదితర 13 గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి.
అక్రమ నిర్మాణాలు
నిర్మల్ పట్టణంలోని గొలుసుకట్టు చెరువులో శిఖం భూములు బఫర్ జోన్ పరిధి లో అక్రమంగా నిర్మాణాలను జరుగుతున్నాయి. నీటిపారుదల శాఖ వద్ద చెరువుకు సంబంధించిన భూముల రికార్డుల విషయంలో గందరగోళం నెలకొనడంతో సరి హద్దులు గుర్తించకపోవడం ఎందుకు కార ణం. నిర్మల్ పట్టణంలోని కంచు రెడ్డి కట్ట, ధర్మసాగర్ పల్లి చెరువు గుల్లపేట్ మంజులాపూర్ మూతి తలాబ్ చెరువులో శిఖం భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్టు స్థానికులు తెలుపుతున్నారు. చెరువు శిఖం భూములకు ఆనుకొని పట్టా భూములను కొనుగోలు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు బడా నేతలు పక్కనే ఉన్న ఎఫ్టీఎల్ పరిధిలో శిఖం భూములు బఫర్ జోన్ భూములను ఆక్రమించుకొని ఇళ్ల స్థలాలకు అణువుగా మార్చుకుంటున్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎఫ్ టి ఎల్ బఫ్ఫెర్ జోన్ పరిధిలో భూములు అన్న క్రితం కాకుండా నీటిపారుదల శాఖ రెవెన్యూ ము న్సిపల్ సంయుక్తంగా సర్వే నిర్వహించి సరిహద్దులను గుర్తించాలి. అయితే పట్టణంలో గత పది ఏళ్ల నుంచి భూములకు బాగా డిమాండ్ ఏర్పడడంతో కొందరు శిఖం భూములను ఆక్రమించుకొని మొరంతో నింపి వెంచర్లు ప్లాట్లుగా మార్చి ఇతరులకు విక్రయిస్తున్నారు. ఈ చెరువు భూముల ఆనుకుని ఉన్న ప్లాట్లకు కనీసం 30 లక్షల నుంచి 40 లక్ష వరకు డిమాండ్ ఉందని చెప్తున్నారు.
కంచరొడ్డి కట్ట ధర్మసాగర్ చెరువులో దానికంటే డబ్బులు రేట్లు ఉన్నాయి. శిఖం భూములు ఆక్రమణలకు గురైనట్టు అధికారులు ఫిర్యాదు చేసే తప్ప వాటి జోలికి వెళ్లడం లేదు. వెళ్లిన అధికారులు సర్వే చేసి ల్యాండ్ రికార్డ్ సర్వే ద్వారా సరిహద్దులు గుర్తించిన శాశ్వతంగా కంచ ఏర్పాటు చేయకపోవడంతో మళ్లీ ఆక్రమణలు కొనసాగుతున్నాయి. పట్టణంలోని ప్రధానంగా కంచరడు కట్ట మంజులాపూర్ చెరువు. ధర్మసాగర్ గుల్ల పెట్టి చెరువు నటరాజ్ నగర్ చెరువులో ఈ ఆక్రమణ పర్వం జోరుగా సాగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది.
తాత్కారిగా చర్యలు
నిర్మల్ పట్టణంలోని గొలుసుకట్టు చెరువుల్లో భూ ఆక్రమణలు జరగడంతో అధికారులు వాటి తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ప్రభుత్వ భూముల ను కాపాడిన అధికారులు అక్కడ శిఖం భూముల సంరక్షణకు తప్పకుండా కంచెను లేదా పెద్ద గుంతను ఏర్పాటు చేయాలి. చేయకుండా బండ గుర్తులు పెట్టడం వల్ల వాటిని తొలగించి మళ్లీ అదే ప్రాంతాల్లో ఆక్రమణలు చేస్తున్నారు.
నిర్మల్ పట్టణంలోని గొలుసుకట్టు చెరువులో భూ ఆక్రమణ పై జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జాయిం ట్ కలెక్టర్ కిషోర్ కుమార్ ల్యాండ్ రికార్డ్ అధికారి మున్సిపల్ రెవెన్యూ అధికారుల సమక్షంలో చెరువుల పరిరక్షణ చేపడుతున్నట్టు చెప్తున్నా భూఆక్రములు మాత్రం ఆగడం లేదని కాలనీలవాసులు ఆరోపిస్తున్నారు. చెరువు భూములను ఆక్రమించుకో వడం వల్ల ప్రభుత్వ విలువైన భూములు ప్రైవేటు పరం కావడం, భూగర్భ జలాలు తగ్గడం, ఆయకట్టు పడిపోవడం, మచ్చ కార్మికులకు ఉపాధి లేకుండా పోవడం, తదితర కారణాలు ఏర్పడుతున్నాయి. ఈ భూములను శాశ్వతంగా పరిరక్షించునకు ప్రభుత్వం ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
ఆక్రమణలు తొలగింపు
నిర్మల్ పట్టణంలోని నిర్మల్ ముఖద్వా రం కట్ట చెరువులో శిఖం భూముల్లో ఆక్రమణలు జోరుగా సాగుతుందని గురువారం రెవిన్యూ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చెరు వులో ఉన్న శిఖములో మొరంపోసి వెంచర్లు ఏర్పాటు చేసి ప్లాట్లను విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు నిర్మల్ అర్బన్ తాసిల్దార్ రాజు రెవెన్యూ సిబ్బందితో కలిసి ఆక్ర మణలు జెసిబి సాయంత్రం తొలగించారు. ఈ భూములు ప్రభుత్వ శిఖం భూములను ఇక్కడ ఎలాంటి ఆక్రమణలకు పాల్పడ్డా చర్యలు తీసుకుంటామని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో పట్టణంలోని అన్ని గొలుసుకట్టు చెరువులో శిఖం భూములు సరిహద్దులు గుర్తించి వాటి రక్షణకు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా అధికారులు తెలిపారు.
భూ ఆక్రమణలకు పాల్పడితే చర్యలు
నిర్మల్ పట్టణంలోని గొలుసుకట్టు చెరువులో భూ ఆక్రమణలకు పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. పట్టణంలోని గొలుసుకట్టు చెరువుల్లో ప్రభుత్వ శిఖం భూములను గుర్తించి వాటి రక్షణకు తక్షణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. భూము లు ఆక్రమణకు గురి అయితే వెంటనే రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్




