27 July, 2026 | 1:47 AM

ఎండోక్రైన్ సంబంధిత వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచాలి

27-07-2026 01:06 AM

తెలంగాణ ఎండోక్రైన్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ బిపిన్ సేథీ

పంజాగుట్ట, జూలై 26 (విజయక్రాంతి): ఎండోక్రైన్ సంబంధిత వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఎండోక్రైన్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ బిపిన్ సేథీ అన్నారు.హోటర్ మారిగోల్ లో ఆదివారం జరిగిన సొసైటీ ఏడో వార్షిక సదస్సులో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ సేథీ మాట్లాడుతూ రెం డు రోజుల పాటు సదస్సు విజయవంతంగా జరగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. డయాబెటిస్, ఒబెసిటీ, థైరాయిడ్, ఇతర హర్మోన్ల సంబంధించిన వ్యాధుల నిర్ధారణపై నిపుణులతో జరిగిన చర్చలు అర్థవంతంగా సాగా యన్నారు. వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి సరైన చికిత్స అందిస్తే రోగులకు మెరుగైన ఫలితాలు అందింవచ్చని తెలిపారు.

ఎండోక్రైన్ సంబంధిత వ్యాధులు అంటువ్యాధులు కావని పేర్కొన్నారు. వాటిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా రోగుల ఆయుర్దాయం మెరుగుపడుతుందన్నారు.ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండడం వల్ల చాలా మందికి సరైన చికిత్స పొందలేకున్నారని అభిప్రాయపడ్డారు. వార్షిక సదస్సుల నిర్వహణ ద్వారా అవగాహనను పెంపొందించాలనే ప్రయత్నం కొనసాగిస్తామని ప్రకటించారు.

అనంతరం సదస్సు నిర్వహణ కార్యదర్శి, నిమ్స్ డాక్టర్ బియాట్రిస్ ఆన్ మాట్లాడుతూ డయాబెటిస్, ఒబెసిటీ, థైరాయిడ్, మెటబాలిక్ సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయన్నారు. అందువల్ల వైద్యులు నిరం తరం వాటికి సంబంధించిన చికిత్సపై అవగాహన పెంచుకోవాలన్నారు.శాస్త్రీయ సమా చారం అందించడం ద్వారా వైద్యులతో పాటు ప్రజలకు మేలు చేయడమే తమ లక్ష్యమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలల నుంచి ఎండోక్రైనాలజిస్టులు, వైద్యులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.