27 July, 2026 | 1:43 AM

రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి

27-07-2026 12:56 AM

కోకాపేటలో రజక ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించాలి 

అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షుడు మొగ్గ అనీల్ కుమార్

ఎల్బీనగర్, జూలై 26: తెలంగాణ రాష్ట్రంలో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చి, సంక్షేమ పథకాలను అమలు చేయాలని, రజక ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించాలని అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షుడు మొగ్గ అనీల్ కుమార్ డిమాండ్ చేశారు. హస్తినాపురంలో ఆదివారం అఖిల భారత రజక సంఘం సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  రజకులకు ఇస్తున్న 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పెండింగ్ బకాయిలను చెల్లించాలన్నారు. రజకులను ఎస్సీ జాబితాలోకి చేరుస్తామని తెలంగాణ అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపాలని, ట్యాంక్ బండ్ మీద ఐలమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించాలని కోరారు. రజక ఆత్మగౌరవ భవనానికి ఉప్పల్ భగాయత్ లో కాకుండా కోకాపేటలో అన్ని బీసీ సంఘాలకు ఇచ్చినట్లుగా రెండున్నర ఎకరాల స్థలాన్ని కేటాయించి రజక భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం రజకులకు మోసం చేయాలని చూస్తే రజకుల సత్తా చూపిస్తామని హెచ్చరించారు. రజకులకు వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. రాబోయే రోజుల్లో అఖిల భారత రజక సంఘం హక్కుల సాధన కోసం ఉద్యమాలు చేస్తామన్నారు. తెలంగాణలో అఖిల భారత రజక సంఘం కమిటీలను గ్రామస్థాయి నుంచి నియమిస్తామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి సతీష్ రజక, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ రజక, నాయకులు శివకుమార్ రజక, శ్రీధర్ రజక, లక్ష్మణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.