ప్రాపర్టీ టాక్స్ పై ప్రజలకు అవగాహన కల్పించండి
ఏప్రిల్ మాసంలోనే అనుకున్న లక్ష్యాలను సాధించండి.
కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎన్. వసంత.
జవహర్ నగర్/ దమ్మాయిగూడ,(విజయక్రాంతి): కీసర సర్కిల్ పరిధిలోని ప్రజలకు ప్రాపర్టీ ట్యాక్స్ పై అవగాహన కల్పించాలని తద్వారా ఏప్రిల్ మాసంలో అనుకున్న లక్ష్యాలను సాధించి ఇంటి పన్నులు పూర్తిగా వసూలు చేయాలని కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎన్. వసంత పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కీసర సర్కిల్ పరిధిలోని దమ్మాయిగూడ వార్డ్ ఆఫీసులో గురువారం రెవెన్యూ సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏప్రిల్ మాసంలో గాను ఐదు శాతం రెబేటుతో ఇంటి పన్నులు వసూలు చేయటగాను రెవెన్యూ అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధియే ధ్యేయంగా పనిచేయాలని సిబ్బంది అనుకున్న లక్ష్యాలను సాధిస్తూ ఇంటి పన్ను వసూళ్ల విషయంలో 100% ప్రగతిని సాధించాలని సూచించారు. ఇందుకోసం ఇంటి పన్ను వసూలులో ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి ఐదు శాతం రిబేటుతో ఇంటి పన్నులు వసూలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీలు వెంకటేష్, శ్రవణ్, మధుసూదన్ రెడ్డి, నగేష్, రెవెన్యూ టాక్స్ ఇన్స్పెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లు, వార్డ్ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.




