3 March, 2026 | 1:33 AM

మెగా వైద్య శిబిరం ప్రారంభం

03-03-2026 12:00 AM

కోదాడ, మార్చి 2 : మాతృదేవోభవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్.ఎస్.వి ఫంక్షన్ హాల్లో యశోద హాస్పిటల్ వారి సౌజన్యంతో సోమవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు మాతృదేవోభవ ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీ యమన్నారు.

శిబిరంలో సుమారు 300 మందికి పైగా రోగులకు గుండె, ఎముకల వ్యాధులకు నిపుణులైన వైద్యులతో ఉచితంగా పరీక్షలు నిర్వహించారు.  స్థానిక కౌన్సిలర్ వాడపల్లి రంగమ్మ, గుండపునేని నాగేశ్వరరావు, పందిరి నాగిరెడ్డి,  సొసైటీ కోదాడ అధ్యక్షురాలు పబ్బా గీతా దేవి, కార్యదర్శి ఓరుగంటి రమాదేవి, కోశాధికారి ఇమ్మడి సతీష్ బాబు, గౌరవ అధ్యక్షులు రాచర్ల కమలాకర్, ఉపాధ్యక్షులు బొగ్గారపు రేఖా రాణి, మంజుల, స్వాతి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.