ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించాలి
హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య..
హనుమకొండ (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు సత్వర పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య(District Collector P. Pravinya) ఆదేశించారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజలు అందించిన అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు.
ప్రజలు అందించిన అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు త్వరగా పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ, గృహ నిర్మాణ, భూ రికార్డులు సర్వే, విద్యుత్, మున్సిపల్, విద్య, సాగునీటి పారుదల, మెప్మా, వైద్య ఆరోగ్య, కుడా, ఉపాధి కల్పన, తదితర శాఖలకు సంబంధించి 137 అర్జీలను ప్రజలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వై.వి. గణేష్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ నారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సమిష్టి కృషితో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన సాధ్యం.
ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సమిష్టి కృషి, సమన్వవయంతో బాల కార్మికు వ్యవస్థ నిర్మూలన సాధ్యపడుతుందని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాలమేరకు జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు జూన్ 9 నుండి 15వరకు ఏర్పాటు చేసిన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంపై సోమవారం రోజున కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమన్వయ సమావేశం జిల్లా సంక్షేమ అధికారి జే. జయంతి అధ్యక్షతన నిర్వహించగా హాజరైన కలెక్టర్ గోడ పత్రికను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ.. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు స్పెషల్ డ్రైవ్ టీమ్ నిబంధనల ప్రకారం జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో, షాపుల్లో, ప్రమాదకర ప్రాంతాల్లో కార్మిక శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, కార్మిక శాఖ, యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీస్ యూనిట్, చైల్డ్ హెల్ప్ లైన్, షేర్, ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ, స్వచ్ఛంద సంస్థల సహకారంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అన్నారు.
14 సంవత్సరాలలోపు బాల బాలికలు పనిచేస్తున్నట్లు గుర్తిస్తే బాల కార్మిక నిర్మూలన చట్టం ప్రకారం సంబంధిత యజమానులపై చట్ట ప్రకారం కేసు నమోదు చేయాలని,18 సంవత్సరాల లోపు బాల బాలికలు పనిచేస్తున్నట్లు గుర్తిస్తే బాలల న్యాయ చట్టం ప్రకారం యజమానులపై కేసులు నమోదు చేయాలని అన్నారు. జిల్లా సంక్షేమ అధికారి జే. జయంతి మాట్లాడుతూ.. స్పెషల్ డ్రైవ్ విజయవంతం కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తే సాధ్యమవుతుందని, రోజు వారీ నివేదికలు కార్మిక శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం వారి ఆధ్వర్యంలో సేకరించి నివేదికలు అందజేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటి కమిషనర్ ఆఫ్ లేబర్ ఏ.ఎస్.వినిత, ఎన్సిఎల్పి డైరెక్టర్ బుర్ర అశోక్ కుమార్, బాలల సంక్షేమ సమితి సభ్యులు కజాంపురం దామోదర్, సందసాని రాజేంద్ర ప్రసాద్, జిల్లా బాలల పరిరక్షణ ఇన్చార్జి అధికారి ఎస్ ప్రవీణ్ కుమార్, చైల్డ్ హెల్ప్ లైన్ కో ఆర్డినేటర్ ఎస్.భాస్కర్, ఏహెచ్టియూ ఎస్ఐ పీ ఫిలిప్ రాజ్, పిసి రాము, ఎఫ్ఎంఎంఎస్ఎస్ఎస్ సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ, ప్రోగ్రాం మేనేజర్ బత్తుల కరుణ, సోషల్ వర్కర్స్ ఎం.శ్రీనివాసులు, జి. సునిత, ఓఆర్డబ్ల్యూ పి.విజయ్ కుమార్, షేర్ స్వచ్ఛంద సంస్థ కో ఆర్డినేటర్ టి. శిరీష, ప్రతినిధులు బి.జమున, బి.జ్ఞానేశ్వరి, చామంతి తదితరులు పాల్గొన్నారు.






