17 April, 2026 | 5:47 PM

మోదీ పాలన ఓ స్వర్ణ యుగం!

09-06-2025 06:38 PM

నిర్మల్ (విజయక్రాంతి): మోదీ ప్రభుత్వ 11 ఏళ్ల పాలన ప్రజాసేవ పట్ల సంకల్పం, కృషి, అంకిత భావాలకు ఒక 'స్వర్ణయుగం' అని బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రామ్నాథ్(BJP state leaders Ravula Ramnath) పేర్కొన్నారు. సోమవారం నిర్మల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మోదీ 11 ఏళ్ల స్వపరిపాలన, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ పాలనలో భారత్​ అభివృద్ధి, స్వావంలన వైపు వేగంగా పురోగమిస్తోందని ఆయన అన్నారు. దేశ ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడం ద్వారా భారతదేశాన్ని ప్రతి రంగంలోనూ నంబర్​-1గా మార్చే ప్రయాణం కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు.

"నాయకత్వం స్పష్టంగా ఉన్నప్పడు, సంకల్పం దృఢంగా ఉన్నప్పుడు, ప్రజాసేవ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు- సేవ, భద్రత, సుపరిపాలనలో కొత్త రికార్డులు సృష్టించబడతాని మోదీ ప్రభుత్వం నిరూపించింది" అని రావుల రామ్నాథ్ పేర్కొన్నారు. నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తీసుకువచ్చి అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఒడిసెల అర్జున్, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్,సుంకరి సాయి,జైల లింగం, జాప ప్రసాద్, తోట సత్యనారాయణ, ముప్పిడి రాకేష్, గవస్కర్, రాజు, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.