ప్రభుత్వ విద్యాసంస్థల బాధ్యత ప్రజాప్రతినిధులదే
02-06-2024 02:47 AM
సూర్యాపేట, జూన్1 (విజయక్రాంతి): ప్రభుత్వ విద్యాసంస్థలను నిలబెట్టే బాధ్యత ప్రజాప్రతినిధులదేనని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. కోదాడలో శనివారం తెలంగాణ పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో ‘ప్రభుత్వ బడులు నిలబడాలి.. చదువుల్లో అంతరాలు పోవాలి’ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గత పదేళ్లుగా ప్రభుత్వ వైఫల్యం వల్లే విద్యారంగం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆరోపించారు.






