7 July, 2026 | 12:57 PM

Breaking News

డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు పై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •   ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయం దగ్గర ఉద్రిక్తత   •   తృటిలో తప్పిన ప్రమాదం   •   భువనగిరి మాజీ ఎమ్మెల్యే మృతి పట్ల సీఎం సంతాపం   •   బాన్సువాడ పట్టణంలో డ్రైనేజీలపై ఉన్న దుకాణాల తొలగింపు   •   డ్రైనేజీలపై ఆక్రమణల తొలగింపుకు ప్రజలు సహకరించాలి   •   పొలమెళ్లిన ప్రాణం తిరిగిరాలేదు.. అనాథలైన భార్యాపిల్లలు   •   ప్రధాని మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం   •   నేరాల నియంత్రణ లో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయి: మల్కాజిగిరి సీపీ సుమతి   •   మహారాష్ట్రలో వర్షబీభత్సం.. 24 గంటల్లో 67 సెం.మీ వాన   •  

అన్నదాతలకు అండగా ప్రజా ప్రభుత్వం

16-06-2025 09:40 PM

రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి..

మందమర్రి (విజయక్రాంతి): రాష్ట్రంలోని అన్నదాతలకు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు రాష్ట్రవ్యాప్తంగా రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రైతులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో బాగంగా సోమవారం మండలంలోని శంకరపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సండ్రోన్ పల్లి, బోక్కలగుట్ట రైతు వేదికలలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ను మండల రైతులు వీక్షించారు. 2025 వానాకాలం రైతు భరోసా నిధుల విడుదల ప్రకటనను రైతులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... రైతులు వరితో పాటు ఇతర ఆహార ధాన్యాల పంటలు సాగుపై రైతులు దృష్టి సారించాలని కోరారు. రైతులను అన్ని విధాల ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేశ్వర్, తహసీల్దార్ సతీష్ కుమార్,వ్యవసాయ అధికారి కిరణ్మయి, వ్యవసా య విస్తరణ అధికారులు ముత్యం తిరుపతి, సైండ్ల కనకరాజు, ఉద్యానవనాధికారి కళ్యాణి, రైతులు కమల మనోహర్ రావు, ఎగుడ రాయమల్లు, భారథపు తిరుపతి, అన్నం మధునయ్య, కొట్రాంగ్ శ్రీనివాస్,మహేందర్ రెడ్డి, తిరుపతి లు పాల్గొన్నారు.