ప్రజారోగ్యమే లక్ష్యం
-హైదరాబాద్‌లో మన్సూన్ ప్రత్యేక డ్రైవ్
- పారిశుద్ధ్య కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన
- ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న కమిషనర్ కర్ణన్
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 30 (విజయక్రాంతి): వర్షాకాలం నేపథ్యంలో హైదరాబాద్ నగర ప్రజారోగ్యమే లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ యంత్రాంగం కదిలింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో జూలై 29 నుంచి ప్రారంభ మైన మన్సూన్ ప్రత్యేక డ్రైవ్ ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటికే 30 వార్డులలో పూర్తి కాగా ఆగస్ట్ 8 నాటికి మొత్తం 150 వార్డులలో వర్షాకాల ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్ర మం పూర్తికానుంది.
నగరాన్ని ‘ఆరోగ్య, పరిశుభ్ర హైదరాబాద్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత మార్గదర్శనంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్ నేతృత్వంలో ముందుకు సాగుతున్నది. ‘పరిశుభ్ర హైదరాబాద్’ లక్ష్యంగా క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో ఘన వ్యర్థాలు, నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలు, పచ్చి వ్యర్థాలు, ఇంజనీరింగ్, అర్బన్ బయో డైవర్సిటీ విభాగాల పనుల కారణంగా ఏర్పడిన మిగులు వ్యర్థాలు, వర్షాల వల్ల ఏర్పడిన సిల్ట్ డిపాజిట్లను పారిశుద్ధ్య కార్మికులు తొలగిస్తున్నారు. ప్రతిరోజూ శానిటేషన్ కార్య క్రమాల తరువాత రోజూ ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఈ చర్యలు చేపడుతున్నారు.
అధికారులు, కార్మికులు హై అలెర్ట్
కమిషనర్ కర్ణన్ మాన్సూన్ స్పెషల్ డ్రైవ్ అమలుపై శ్రద్ధ పెట్టడంతో పాటు ప్రతి రోజూ ఉదయం ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిష నర్లు, ఆరోగ్య శాఖాధికారులు, ఎస్‌డబ్ల్యూఎం ఇంజినీర్లు, సర్కిల్ మేనేజర్లు, ఎం టమాలజిస్టులు ఈ డ్రైవ్‌ను క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ సమర్థవంతంగా అమ లు చేసేందుకు కృషి చేస్తున్నారు. దోమలు పుట్టకుం డా, కుట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డ్రైవ్‌లో భాగంగా అధికారులు ఇంటి ఇంటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆరోగ్య హైదరాబాద్‌కు ప్రజలం దరూ సహకరించాలని కోరుతున్నారు. బుధవారం హిమాయత్ నగర్ విట్టల్ వాడి కాలనీలో వర్షాకాల ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్ర మాలు నిర్వ హించారు. కార్పొరేటర్, డిప్యూటీ కమిషనర్‌లు డ్రైవ్‌లో పాల్గొని ప్రజా భాగస్వామ్యంతో చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రజలను చైతన్యం చేస్తున్నాం
కమిషనర్ ఆదేశాల మేరకు గోషామహల్ సర్కిల్ లో వర్షాకాల ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నాం. వర్షాల వల్ల ఎక్కడైనా చెత్త పోగైన, వ్యర్థాలు పేరుకుపోయిన, సిల్ట్ నిల్వ ఉన్న క్షేత్ర స్థాయిలో గుర్తించి తొలగిస్తున్నాం. కీటక జనిత వ్యాధుల బారిన పడకుండా ప్రజలను చైతన్యం చేస్తున్నాం. ఆరోగ్య హైదరాబాద్ లక్ష్యంగా పని చేస్తున్నాం.
ఉమా ప్రకాష్, డిప్యూటీ కమిషనర్, గోషా మహల్ సర్కిల్
అవగాహన, చైతన్యం ర్యాలీ
మాన్సూన్ స్పెషల్ డ్రైవ్ సందర్భంగా మా కాలనీలో అధికారులు ఆరోగ్య అవగాహన, చైతన్యం ర్యాలీ నిర్వహించారు. మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేశారు. దోమలు వృద్ధి చెందకుండా, కుట్టకుండా, డెంగ్యూ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త లు ఇంటింటికి వెళ్లి వివరించారు. కరపత్రాలు పంపిణీ చేశారు.
అంబికా జైస్వాల్, విట్టల్ వాడి






