31-07-2025 01:14:55 AM
భద్రాద్రి కొత్తగూడెం/మహబూబాబాద్, జూలై 30 (విజయక్రాంతి): రాష్ట్ర విభజన సమయంలో భద్రాచలంలోని ఐదు గ్రామపంచా యతీలు ఆంధ్రాలో కలిపిన పాపం కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాం చందర్‌రావు అన్నారు. బుధవారం ఆయన భద్రాచలం సీతారామచంద్ర స్వామివారిని ద ర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లాలో వీరభద్ర స్వామి ఆలయంలో వీరభద్ర స్వామి, భద్రకాళి అమ్మవార్లను దర్శించుకున్నారు.
మహబూబాబాద్, పాల్వంచ, ఇల్లందు పట్టణాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు భద్రాద్రి ఆలయ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయన్నారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధికి కేంద్రం రూ.98 కోట్లు కేటాయించగా, ఇప్పటివరకు రూ.43 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టారని, డీపీఆర్ వ చ్చిన అనంతరం మిగిలిన నిధులు కేటాయిస్తారని స్పష్టం చేశారు.
పురుషోత్తంపట్నంలో ఉన్న ఆలయ భూములు అన్యమత సంస్థలకు, వాణి జ్య అవసరాలకు కేటాయించడాన్ని ఖండించా రు. ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి రా మాలయ భూములను స్వామివారికి చెందేలా కృషి చేస్తానని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో బీజే పీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లలో ముస్లింలకు 10 శాతం ఇచ్చేందుకు కుట్రలు పన్నుతోందని ఆ రోపించారు. దీంతో బీసీలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందన్నారు. మంత్రి తుమ్మల మొం డితనం వల్లనే సీతారామ ప్రాజెక్టును దారి మళ్లించారని ఆరోపించారు. సీపీఎం నుంచి త్వరలో చేరికలు ఉంటాయని వెల్లడించారు.