12 June, 2026 | 2:11 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

ప్రజారోగ్య సేవలు మరింత బలోపేతం

10-02-2026 12:32 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),ఫిబ్రవరి 9: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి,ప్రజారోగ్య సేవలను మరింత బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని డీసీసీ ఉపాధ్యక్షుడు,హైకోర్టు న్యాయవాది దరూరి యోగానంద చార్యులు అన్నారు.సోమవారం మండల కేంద్రం అర్వపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవుట్ పేషంట్ల సౌకర్యార్థం తన సొంత ఖర్చులు రూ.25వేలతో 4 స్టీల్ చైర్స్ సెట్లను బహుకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం వందకు పైగా రోగులు వచ్చే పీహెచ్సీకి అవసరమైన మౌలిక సదుపాయాల కొరతను తీర్చడం ద్వారా రోగులు వారి సహాయకులు ఇబ్బందులు లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని అన్నారు.

అనంతరం ఆసుపత్రి సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ భూక్యా నగేష్ నాయక్,సీహెచ్‌ఓ బిచ్చునాయక్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు,ఆలయ చైర్మన్ అనిరెడ్డి రాజేందర్ రెడ్డి,కాంగ్రెస్,యూత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోరపాక సత్యం,శిగ నసీర్ గౌడ్,హెల్త్ సూపర్వైజర్ లలిత,సునీత,అనూష,ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.