calender_icon.png 4 February, 2026 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వాయర్ల నిర్మాణం ప్రారంభించండి

04-02-2026 01:30:19 AM

కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ హెచ్‌ఎండబ్ల్యూఎస్ ఎండీతో ఎమ్మెల్యే భేటీ 

హైదరాబాద్, ఫిబ్రవరి 3(విజయక్రాంతి): నియోజకవర్గంలో ప్రజల తాగునీటి సమస్యను నివారించే ఉద్దేశం తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు నిర్మించ నున్న మంచినీటి రిజర్వాయర్ల నిర్మా ణాన్ని త్వరగా మొదలు పెట్టాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ మంగళవారం ఖైరతాబాద్‌లోని హెచ్‌ఎండబ్ల్యూఎస్ ప్రధాన కార్యా లయంలో ఎండీ అశోక్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. అందుకు ఎండీ స్పందిస్తూ వెంటనే హెచ్‌ఎండబ్ల్యూఎస్ డైరెక్టర్‌ను రేపే క్షేత్రస్థాయిలో పర్యటించేలా చేసి పనులను త్వరగా మొదలు అయ్యే విధంగా చూసి వీలైనంత తొందరగా రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి అయ్యేలా చూస్తానని చెప్పారు.