3 March, 2026 | 5:33 PM

దుర్వాసన వెదజల్లుతున్న బ్రాయిలర్ కోళ్ల ఫారాలు

03-03-2026 12:37 AM

రేవల్లి మార్చి 2: తల్పునూరు నుండి రేవెల్లి మండల కేంద్రానికి వెళ్లాలంటే ముక్కు మూసుకుని వెళ్ళవలసిన దుస్థితి ఏర్పడింది. మార్గమధ్యలో గల బాయిలర్ ఫారాలు ఊరికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉండాలి అనే విషయాన్ని పక్కన పెడితే  ప్రయాణికులకు మాత్రం కడుపులోనిది నోట్లోకి వచ్చేంత పనవుతుంది .

ఈ దుర్వాసన శబ్దం ద్వారా అటు మనుషులకు ఇటు పశు పక్ష్యాధులకు రోగాలకు కారణం అవుతున్నాయి. వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని   3-5 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసుకోవాలని దుర్వాసన రాకుండా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు.