11 March, 2026 | 8:16 PM

అందెశ్రీకి నివాళులర్పించిన ప్రజాసంఘాలు

13-11-2025 12:00 AM

ఆలేరు, నవంబర్ 12 (విజయ క్రాంతి): ఆలేరు లో అందే శ్రీ కి ఘనమైన నివాళి అర్పించిన రాజకీయ పార్టీలు, ప్రజా, దళిత, అంబేద్కర్ సంఘాలు. రచయిత, కవి, కళాకారుడు, గాయకుడు, తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన పాటల ద్వారా ప్రజలను మేల్కొల్పిన డాక్టర్ అందే శ్రీ అకాల మరణంతో ప్రజా కళలు, సంస్కృతి సాహిత్యం పెద్ద లోటని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్.జనార్ధన్, బీ సీ సంఘం నియోజక వర్గం అద్యక్షులు పేరపు రాములు, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు తుంగ కుమార్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్, సీపీఐ ఎం.ఎల్ నాయకుడు కేమిడి ఉప్పలయ్య, సిపిఎం సీనియర్ నాయకుడు మొరిగాడి చంద్రశేఖర్ లు అన్నారు.

ఆలేరు డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ముందు అందే శ్రీ చిత్ర పటానికి పూలమాలలతో ఘనంగా నివాళులార్పించారు. అందే శ్రీ  అణగారిన వర్గాల క్షేమం కోసం, వారి బతుకుల్లో, జీవితాల్లో మార్పు రావాలని తన గీతాల ద్వారా తపించాడో ఆ వర్గాల ప్రజలు బతుకుల గురించి ప్రభుత్వాలు పాటుపడినపుడే అందే శ్రీ కి అర్పించిన నివాళి అవుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి ఇక్కిరి సహదేవ్, నాయకులు కల్లెపు అడివయ్య, ఇక్కిరి శ్రీనివాస్, జూకంటి పౌల్, కొల్లూరు మాజీ సర్పంచ్ పిల్లల మర్రి శంకరయ్య, దార జోగయ్య, ఆలేరు వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ కిష్టయ్య, దార యాదగిరి, పాకాల నరేష్,గుజ్జ పాండు, జూకంటి అనిల్, జూకంటి బాబు,తులసయ్య, బుడిగె లక్ష్మయ్య, బుగ్గ నవీన్, సురేష్, నమిలే అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.