calender_icon.png 13 November, 2025 | 1:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారదర్శక పాలన కోసమే సమాచార హక్కు చట్టం

13-11-2025 12:00:00 AM

ఆర్టీఐ కమిషనర్ అయోధ్యరెడ్డి 

యాదాద్రి భువనగిరి నవంబర్ 12 (విజయక్రాంతి): సమాచార హక్కు చట్టం ఆర్టిఐ -2005 ను పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులు, సహాయ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర సమాచార కమిషనర్ పోరెడ్డి అయోధ్య రెడ్డి అన్నారు.

బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టం పై రాష్ట్ర సమాచార కమిషనర్ల ఆధ్వర్యంలో పీఐవో, అపిలెట్ అధికారు లకు చట్టం పట్ల నిర్వహించిన అవగాహన సదస్సులో సమాచార కమిషనర్లు దేశాల భూపాల్, పి.వి శ్రీనివాస్ రావు,శ్రీమతి. మోసినా పర్వీన్, కలెక్టర్ హనుమంతరావు, డి.సి.పి అక్షాంక్ష్ యాదవ్, ఏసిపి రాహుల్ రెడ్డి లతో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆర్టీఐ కమిషనర్ అయోధ్య రెడ్డి మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం కింద సమాచారం అడిగిన వాళ్లను దోషిగా చూడాలని లేదన్నారు. సమాచార హక్కు చట్టం ప్రకారం అడిగిన సమాచారం తప్ప కుండా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

సమాచార హక్కు చట్టం కమిషనర్ పీవీ. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం పౌరులకు పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలన అందించడంలో కీలకమైన సాధనమని తెలిపారు. రాష్ట్ర సమాచార కమిషన్ పర్వీన్ మాట్లాడుతూ... సమాచార హక్కు చట్టాల్లో 6 చాప్టర్లు , 31 సెక్షన్లు ఉన్నాయన్నారు.  సెక్షన్ల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పి .ఐ.ఓ, ఏ.పి.ఐ.ఓ లకు క్షుణ్ణంగా వివరించారు.

కలెక్టర్ హనుమంత రావు మాట్లడుతూ... సమా చార హక్కు చట్టం నిజాయితీగా , పారదర్శకంగా , నిక్పక్షికంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కమిషన్ పని చేస్తుందన్నారు.  అనంతరం కమిషనర్లను శాలువ, మెమొంటోలతో కలెక్టర్  సత్కరించారు. సమావేశ అనంతరం పెండింగ్ లో ఉన్న ఆర్టీఐ దరఖాస్తులపై విచారణ నిర్వహించారు.

సంబంధిత పీఐవో అధికారులు, దరఖాస్తుదారుల నుండి వివరాలు స్వీకరించి తగిన ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు,  ఆర్డిఓ కృష్ణా రెడ్డి , జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ,వివిధ శాఖల పిఐఓ లు, ఏ . పి.ఐ.ఓ లు,అప్పీలెట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.